Hasanparthy | గర్భకోశ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Hasanparthy | గర్భకోశ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • శిభిరాన్ని ప్రారంభించిన మడిపల్లి సర్పంచ్ రంజిత్

Hasanparthy | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : పశువులకు సోకే గర్భకోశ వ్యాది నివారణకు పాడి రైతులు అప్రమత్తంగా ఉండి, పశు వైద్యాధికారులను సంప్రదించాలని మడిపల్లి సర్పంచ్ బుర్ర రంజిత్ కోరారు. ఈ రోజు హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలో ఉమ్మడి వరంగల్ పశుగణాభివృద్ధి సంస్థ, తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు సోకే గర్బకోశ చికిత్స నివారణ శిబిరాన్ని రంజిత్ ప్రారంభించారు. ఈసందర్బంగా రంజిత్ మాట్లాడుతూ… పశు సంతతిని అభివృద్ధి పర్చుకోవడానికి గర్భకోశ వ్యాధి నివారణ చర్యలు చేపించాలని కోరారు. పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ జి సంపత్ రావు శిభిరంలో పాల్గొని మాట్లాడుతూ.. ఈ శీతాకాలంలో పశువులు ఎదకు వస్తాయని,ఎదకురాని పశువులను గర్భకోశ చికిత్స చేసుకొని తగిన మందులు వాడుకొని చూలు కట్టించుకోవాలని సూచించారు. ఆడ దూడల కొరకై సెక్స్ సార్టెడ్ సెమన్ సదుపాయాన్ని రైతులు వినియోగించుకొని ఆడ దూడలను పుట్టించుకోవాలని కోరారు. ఈమేరకు
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కాందారి ప్రదీప్, చింతగట్టు వియల్ఓ బి సురేష్, ఎల్లాపూర్ జెవిఓ శారద గోపాలమిత్ర సూపర్ వైజర్ రాజేశ్వర్ రావు, గోపాల మిత్రులు అనిల్, రాజేష్, రజాక్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply