గూడూరు ఏఈ, డీఈఈ సస్పెన్షన్
తిరుపతి ఆంధ్రప్రభ బ్యూరో రాయలసీమ, ఆంధ్రప్రభ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్ లో అసిస్టెంట్ ఇంజనీర్ బి. మల్లికార్జున, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. శంకరయ్యను సస్పెండ్ చేస్తూ ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ (టెక్నికల్ అండ్ హెచ్ఆర్ డి) కె. గురవయ్య గురువారం తెలిపారు.
గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్ లో విద్యుత్ పరికరాలకు కొనుగోళ్లల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారని, అదేవిధంగా ఈ అంశంపై వివరణ కోరుతూ నెల్లూరు సర్కిల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్/టెక్నికల్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్. బాలచంద్రకు షోకాజ్ నోటీసును జారీ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.