రూ. 10 లక్షలతో భవన నిర్మాణానికి భూమి పూజ

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి పంచాయతీ కేంద్రంలో పదిలక్షలతో నిర్మించే గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి శనివారం పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలీ0షా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ఇందిరా క్రాంతి పథకం స్వయం సహాయక సంఘాల మహిళలకు సమావేశం నిర్వహించడానికి ఈ సమైక్య భవనం ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. మహిళలను ఆర్థికంగా ఎదగడానికి ప్రజా పాలన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సర్పంచ్ ఆత్రం మీరా జాలీ0షా అన్నారు. భవన నిర్మాణ పనులు నాణ్యత పాటించాలని భవన పనులు త్వరగా పూర్తీ అయ్యేలా చూడాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆత్రం శంకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి షారుక్, పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్పెక్టర్ బాబూలాల్, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీబాయి, మహిళా సంఘం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
