Govt School | 528 మంది విద్యార్థులకు అండగా..

Govt School | 528 మంది విద్యార్థులకు అండగా..

Govt School | కరీమాబాద్, ఆంధ్రప్రభ : గంట రవికుమార్ స్థాపించిన జీఆర్‌కే ఫౌండేషన్ ద్వారా వరంగల్ నగరం(Warangal city)లోని 14 ప్రభుత్వ పాఠశాల‌ల్లోని పదవ తరగతి 528 మంది విద్యార్థులకు అండగా నిలుస్తూ, పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు జీఆర్‌కే ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది.

ఈ మేరకు వరంగల్‌ నగరంలోని ప్రభుత్వ పాఠశాల(Government School)లో చదివే సుమారు 528 మంది టెన్త్‌క్లాస్‌ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లిస్తూ ఫౌండేషన్‌ నుంచి చెక్కులను అందించినట్టు ఎండి రఫీ తెలిపారు. ఈ రోజు జీఆర్‌కే ఫౌండేషన్‌ సభ్యులు మాట్లాడుతూ.. తమవంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని గంట రవికుమార్‌ ఆకాంక్షించారని, చదవుకు పేదరికం అడ్డుకారాదని, నిరుపేద విద్యార్థుల్ని(poor students) ఆదుకునేందుకు తనవంతు సహకారం చేస్తానని, జీఆర్‌కే ఫౌండేషన్‌(GRK Foundation) కూడా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

వరంగల్ నగరంలోని పాఠశాలల టెన్త్‌ విద్యార్థుల ఫీజు చెల్లించేందుకు సంబంధిత చెక్కులను పాఠశాలల హెచ్‌ఎంలకు అందించినట్టు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ నుండి 8, 9, 10వ తరగతులు చదివే పేద, ఉత్తమ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌(free tuition)కి శ్రీకారం చుట్టారని జీఆర్‌కే ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు.

Leave a Reply