మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

జన్నారం,ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ వాసి అజ్మీర గోవింద్ నాయక్ మృతి పట్ల నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం రాత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోవింద్ నాయక్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారన్నారు.

ప్రజా తీర్పుతో మూడు సార్లు ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల్లో తనదైన ముద్రవేశారని ఆయన తెలిపారు. అతని మృతి ఖానాపూర్ నియోజకవర్గానికి తీరని లోటని,అతని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఉన్నందున తాను గోవింద నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే అంతిమ యాత్రలో పాల్గొనాలని ఆయన సూచించారు.

Leave a Reply