Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ముంబై : గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు చేరుకుంది. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చిన పసిడి.. మళ్లీ పెరుగుతోంది. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మరలా 98 వేలు దాటాయి. నిన్న తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 పెరిగితే .. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (మే 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,950గా.. 24 క్యారెట్ల ధర రూ.98,130గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,950గా.. 24 క్యారెట్ల ధర రూ.98,130గా నమోదైంది. విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,950గా.. 24 క్యారెట్ల ధర రూ.98,130గా కొనసాగుతోంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్ల ధర రూ.98,130.. 22 క్యారెట్ల ధర రూ.89,950గా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,280గా.. 22 క్యారెట్ల ధర రూ.90,100గా నమోదైంది.

మరోవైపు నిన్న స్వల్పంగా పెరిగిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,00,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,11,000గా నమోదయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్షగా ఉంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన డీటెయిల్స్ ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

Leave a Reply