gold rate in hyderabad| నిన్న తగ్గి.. ఈరోజు పెరిగి..

gold rate in hyderabad| నిన్న తగ్గి.. ఈరోజు పెరిగి..
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో… ఎప్పుడు తగ్గుతాయో తెలియడం లేదు. వీటి ధరలు ఎటుపోతున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఉన్నట్లుండి ఆకాశానికి తాకుతున్నాయి. లేదంటే అమాంతం కూలిపోతున్నాయి. ఒక రోజు రేటు తగ్గిందనుకునే లోపే మరో రోజు బ్లాస్ట్ అవుతుంది. ట్రంప్ యుద్ధ సంకేతాలు ఇవ్వడంతో నిన్న పసిడి రేట్లు కుప్పకూలిపోయాయి. కానీ ఇవాళ మాత్రం మళ్లీ ఊహకందని విధంగా దూసుకెళ్లాయి. సో ధరల మార్పులపై కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇరాన్ అమెరికా శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతున్న వేళ బులియన్ మార్కెట్లలో కొత్త జోష్ నెలకొంది. యుద్ధం ఆగిపోతుందనే భరోసాతో ఇన్వెస్టర్లు ఈ లోహాలపై తిరిగి పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలకు తిరిగి రెక్కలు వస్తున్నాయి. ఏప్రిల్10న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.152 పెరిగింది. శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్10, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది.

