GM Lalit Kumar | నిరుద్యోగ యువతకు ఉపాధి

GM Lalit Kumar | నిరుద్యోగ యువతకు ఉపాధి
- కల్పించేందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
- రామగుండం జీఎం డి లలిత్ కుమార్
- శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్స్ ప్రధానం
GM Lalit Kumar | గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ ప్రభావిత ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే గోదావరిఖని పట్టణంలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశామని రామగుండం ఏరియా-1 జిఎం డి లలిత్ కుమార్ తెలిపారు. ఇవాళ స్థానిక తిలక్ నగర్ ఏరియాలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసిన మంది యువతీ యువకులకు సర్టిఫికెట్స్ ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం లలిత్ కుమార్ శిక్షణ పొందిన యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఉపాధి అవకాశాలు రావడం లేదని ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి సింగరేణి యాజమాన్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈ సంస్థ సౌజన్యంతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ లో 45 రోజులపాటు ప్రముఖ కంపెనీలో అనుభవం కలిగిన నిష్ణాతులైన నిపుణులచే శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. సింగరేణి ద్వారా నిరుద్యోగ యువతీ, యువతులకు ఎన్నో రకాల వృత్తి శిక్షణ తరగతులను ఇప్పించడం జరిగిందన్నారు.
సింగరేణి యాజమాన్యం తమ బాధ్యతగా ఈ ప్రాంతంలోని వేలాది మంది నిరుద్యోగులకు హైదరాబాదు లాంటి మహానగరాల్లో ప్రముఖ కంపెనీల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోటి ప్రపంచంలో మీరు నేర్చుకున్న కోర్సుల ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని జీఎం కోరారు. శిక్షణ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు.జియం.కే.చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం.రవీందర్ రెడ్డి, దశరథం డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఇ, మస్తాన్ ఖాన్ ఎన్.జి.ఓ అండ్ ఏరియా ఇంజనీర్ కే.రామ్మోహన్, వి.టి.సి మేనేజర్ పి.మాధవ రెడ్డి, మురళి కృష్ణ – యస్.డి.సి ఇంచార్జ్, సీనియర్ పిఒ లు శ్రావణ్ కుమార్, సిబ్బంది శేషు, రవీందర్రెడ్డి, ట్రేనర్స్ శ్రీనివాస్, హజిమలన్ ఖాన్, టేక్నిషియన్ యాకుబ్ అధికారులు పాల్గొన్నారు.
