తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మండ కుమార్ స్వామి(45) గీత కార్మికుడిగా కొనసాగుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు లాగానే సోమవారం సాయంత్రం కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కిన కుమారస్వామి అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలయి రక్తస్రావం అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని బ్లూ లైన్ హాస్పిటల్ లో కుమారస్వామిని చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

వారిని మంగళవారం రోజున కల్లు గీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లాల గంగాధర్ గౌడ్, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన కుమారస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందించడంతోపాటు వైద్యానికి సహాయ సహకారాలు అందించాలని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ అన్నారు. రెక్కడితే కానీ డొక్కాడని గీత కార్మికుల జీవితాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

Leave a Reply