General | తోటికోడలు గెలుపుకోసం..

General | తోటికోడలు గెలుపుకోసం..
- సాఫ్ట్ వేర్ ముమ్మరప్రచారం
General | ఊట్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ సర్పంచ్ స్థానం జనరల్(General) మహిళకు కేటాయించడంతో ఊట్కూర్ పట్టణ బీజేపీ బలపరిచిన ఎం.రేణుక భరత్ గెలుపు కోసం తోటికోడలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎం.స్వాతి పృథ్వీరాజ్ ఇవాళ ముమ్మరంగా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
గ్రామాభివృద్ధిని చేపట్టే అభ్యర్థిని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి(development) జరుగుతుందని తనదైన శైలిలో ప్రచారం చేపడుతూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, అభ్యర్థి రేణుక భరత్, నాయకులు విజయ్ కుమార్, కృష్ణయ్య గౌడ్, రమేష్, లక్ష్మణ్, ఆశప్ప, గోపాల్, ఆశప్ప, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.
