కన్నుల పండువగా గంగా హారతి

కన్నుల పండువగా గంగా హారతి

బాసర, ఆంధ్ర ప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో ఈ రోజు కార్తీక పౌర్ణమి(Kartika Full Moon)ని పురస్కరించుకొని గోదావరి నదికి గంగ హారతిని ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో కన్నుల పండువగా నిర్వహించారు.

ఆలయం నుండి గోదావరి నది వరకు మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్(Praveen Pathak), ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అర్చకులు వేద పండితులు, గణపతి, క్షేత్ర ,గోధారమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి నిర్వహించారు. సూర్యేశ్వర ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపు నిర్వహించి జ్వాలాతోరణం వెలిగించారు.

వెలిగించిన జ్వాలాతోరణం గుండా భక్తులు నడుచుకుంటూ వెళ్లి సురేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం గోదారమ్మకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల(Chants)తో ప్రత్యేక పూజలు చేసి గంగా హారతిని కన్నుల పండువగా నిర్వహించి గోదారమ్మకు వాయినం సమర్పించారు.పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయం తరఫున ప్రసాదం పంపిణీ చేశారు. ఈ గంగా హారతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Janaki Sharmila), అడిషనల్ ఎస్పీలు, అవినాష్ కుమార్,రాజేష్ మినా, ఆలయ ఈవో అంజనీ దేవి ,సీఐ మల్లేష్, ఎస్సై శ్రీనివాస్ పోలీసు సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply