TG | బాలికపై సామూహిక లైంగిక దాడి

( ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ) : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్ లో ఓ బాలికపై అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని ఆ బాలికను బెదిరించారు. ఎట్టకేలకు అసలు విషయం బయటకు పొక్కటంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్‌ లో బాధితురాలు సహా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకులపై పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *