మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత…

మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత…

  • ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆంధ్రప్రభ : కొండూరు గ్రామ మత్స్యకార సొసైటీ కి ఫర్నిచర్ సామాగ్రి అందించిన ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి. ఇటీవల పర్యటనలో భాగంగా కొండూరు గ్రామం చేరుకోగా కొండూరు మత్స్యకార సంఘం సభ్యులు వారి కార్యాలయానికి ఫర్నిచర్ అందించాలని కోరగా వెంటనే స్పందించి ఆదివారం మత్స్యకార సొసైటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘం కార్యాలయానికి కావలసిన యాభై చైర్లు, ఒక టేబుల్ పంపిణీ చేసి.

ఇటీవల నూతన నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి రెడ్డికి శాలువాతో సన్మానం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొండూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులి సోమయ్య ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు చికిత్స తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా పరామర్శించి, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజి జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మాజీ సర్పంచ్ కర్ర రవీందర్ రెడ్డి, మండల పార్టీ నాయకులు తాళ్లపల్లి సంతోష్ గౌడ్, లేతకుల రంగా రెడ్డి, ఐత రామ్ చందర్, పెరటి యాదవ రెడ్డి, చందు లక్ష్మన్ స్థానిక నాయకులు దేశబోయిన ఉపేందర్, పుల్ల ఎల్లగౌడ్, పూస కుమార్, శాస్రబోయిన యాకయ్య, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply