ప్రతినిత్యం ప్రజాసేవ… ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం

ప్రతినిత్యం ప్రజాసేవ… ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం
తనదైన మార్క్ అభివృద్ధితో దూసుకెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు
నియోజకవర్గ అభివృద్ధికి సుమారుగా నాలుగు కోట్ల 79 లక్షల నిధులు మంజూరు
మంథని, ఆంధ్ర్రప్రభ : మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధికి నిర్వచనం. మంత్రి శ్రీధర్ బాబు ప్రజా సంక్షేమానికి మార్గదర్శకం. ప్రతినిత్యం ప్రజాసేవతో, ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమంతో మంత్రి శ్రీధర్ బాబు తనదైన మార్క్ అభివృద్ధితో పరిపాలనలో దూసుకవెళ్తున్నారు. మంథని నియోజకవర్గానికి సిఎస్ఆర్ నిధుల కింద మంత్రి శ్రీధర్ బాబు చొరవతో సుమారుగా నాలుగు కోట్ల 79 లక్షల నిధులు వివిధ గ్రామాల సంక్షేమ కార్యక్రమాలకు మంజూరు చేయించినట్లుగా మంత్రి క్యాంపు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
మంథని మండలంలో అడవి సోమన్ పల్లి, ఎక్లాస్ పూర్, గుంజపడుగు, మైదుపల్లి గ్రామాలకు వైకుంఠ రతాల ఏర్పాటు కోసం ప్రతి గ్రామానికి 20 లక్షలు చొప్పున మంజూరు చేయించారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో గంగాపురి పాఠశాల, అడవి సోమన్ పల్లి, సూరయ్య పల్లి, వెంకట పూర్ గ్రామాల పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి పాఠశాలకు పదమూడు లక్షలు, మంథని మండలంలో పుట్టపాక, గోపాల్ పూర్ గ్రామాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం ప్రతి గ్రామానికి 13 లక్షలు, మంథని మండలంలోని నాగేపల్లి, ఎక్లాస్ పూర్, లక్కెపూర్, వెంకట పూర్ (క్రాస్), బట్టుపల్లి, నాగారం (కన్నాల క్రాస్), గుమ్మునూరు ( లక్ష్మీపూర్ క్రాస్) న్యూ మోడల్ బస్సు షెల్టర్ల కోసం ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలను మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంజూరు చేయించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న మంత్ర శ్రీధర్ బాబుకు ఆయా గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
