Market | హమాలీ రేట్లు పెంచాలి

Market | హమాలీ రేట్లు పెంచాలి


ఏఐటియుసి ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల నిరసన


Market | కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : వరంగల్ ఏనుమాముల మార్కెట్లో (Market) సివిల్ సప్లై గోదాము ముందు జరిగిన నిరసనలో రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్ పాల్గొని, హ‌మాలీ కార్మికులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచడం కోసం డిసెంబర్ 25తో రేట్లు అగ్రిమెంట్ అయిపోతుంది. కొత్త రేట్లు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందిగా దానికి సంబంధించినటువంటి హ‌మాలీ కార్మికులకు క్వింటాల్ కు రూ.45లు, దిగుమతి, ఎగుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

రాష్ట్రం మొత్తమ్మీద నూతన గోదాం నిర్మించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రెస్టు సైకిల్ స్టాండ్ (cycle Stand) మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హ‌మాలీ కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇప్పించాలని, అలాగే బోనస్ సౌకర్యం పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పనిచేసే టైం లోపల ప్రమాదం జరిగి ఉంటే ఇన్సూరెన్స్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, వారి కుటుంబాలంద‌రికీ కూడా వర్తించే విధంగా ఉండాలని, వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు దామర కృష్ణ, జిల్లా అధ్యక్షులు దేవన బోయిన రాంబాబు, గండ్రకోట చంద్రమౌళి, కుక్కల రాజు, బండి లింగమూర్తి, అబ్బ బోయిన కుమార్, గుండప్పు కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply