ఆస్పత్రిలో మాయమాటలతో మోసం

ఆస్పత్రిలో మాయమాటలతో మోసం

  • మహిళ పుస్తెలతాడు అపహరణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను మాయమాటలతో మోసం చేసి బంగారు పుస్తెలతాడు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం అచ్చంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొరకు చేరిన బాధితురాలి వద్దకు ఓ గుర్తుతెలియని మహిళ ఆయాగా నటిస్తూ వచ్చింది.

‘మెడలో బంగారం పెట్టుకోవడం మంచిది కాదు.. దొంగలు పడతారు’ అంటూ నమ్మబలికి, సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును తీసుకుని అక్కడి నుంచి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత విషయం గ్రహించిన బాధితురాలు తన బంధువులకు చెప్పగా, వారు ఆ మహిళ కోసం వెతికినా ఆచూకీ లభించలేదు.

దీనిపై ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించగా, ఆ మహిళ తమ వద్ద పనిచేయడం లేదని తెలిపారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రుల భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply