ఆలేరులో మాజీ ఎమ్మెల్యేల ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, పార్టీ ఎన్నికల ఇంచార్జ్, పట్టణ పార్టీ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ అభ్యర్థులు మొరిగాడి మాధవి,బింగి లతా రవి, బీజని కళ్యాణి, పంతం కృష్ణ, పోరెడ్డి జయ,మౌనిక, మోతే కనకమ్మ, యాట శివ, రాయపురం శ్రీనివాస్, పాశికంటి శ్రీనివాస్, యాట శివ తదితరులు పాల్గొన్నారు.
