రోడ్డు ప్రమాదాల నివారణ కోసం..

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే వాహనాలలో ప్రజల ప్రయాణికుల భద్రతను దృషిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డుప్రమాదాల నివారణకు నంద్యాల పోలీసులు గురువారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు నంద్యాల జిల్లా రాత్రిపూట తిరిగే వాహనాలను ఆపి “స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని కడప నుండి నంద్యాల హైవే, కర్నూలు నుండి విజయవాడ వెళ్ళే వాహనాలు, నంద్యాల నుండి కర్నూలు జాతీయ రహదారి 44 హైవే, కర్నూలు నుండి బెంగుళూరు వైపు వెళ్ళే వాహనాలు, జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలలో ఈ “స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో”కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాక వాహనాలకు సంబంధించిన ద్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నామన్నారు. వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేశారు. వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు తెలిపారు.

Leave a Reply