Fish Market | చిన్న చేపకే రూ.4 వేల ధర..

Fish Market | చిన్న చేపకే రూ.4 వేల ధర..
Fish Market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వరద కాలంలో మాత్రమే లభించే పులస చేప, అన్‌సీజన్‌లో గోదావరిలో చిక్కడంతో స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రాంతంలో గోదావరి నదిలో పులస చేప జాలరకు చిక్కింది. సాధారణంగా వరదల సమయంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన చేప, ఏప్రిల్ నెలలో దొరకడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Fish Market | పులస చేప దొరకడం చాలా అరుదు..
ఈ పులస చేపను పి.గన్నవరం చేపల మార్కెట్‌కు తీసుకురాగానే, కొనుగోలు దారులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. పులసకు ఉన్న ప్రత్యేక రుచి, అరుదైన లభ్యత కారణంగా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఆ చేపకు సుమారు రూ.4,000 వరకు భారీ ధర పలికింది. అన్‌సీజన్‌లో పులస చేప దొరకడం చాలా అరుదు కావడంతో ఈ ధర సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో కోనసీమలో పులస మళ్లీ చర్చనీయాంశంగా మారింది.


