Fire Accident | అఫ్జల్ గంజ్‌లో అగ్ని ప్ర‌మాదం …

హైద‌రాబాద్ – అఫ్జల్ గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మంటల ప్రభావానికి పక్కన ఉన్న ప్లాస్టిక్ గోదాముకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

పది మంది ర‌క్షించిన అగ్నిమాప‌క సిబ్బంది…

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న10 మంది రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదంతో చుట్టు ప్రక్కల నివాశితులు భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply