Stock market | బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు !

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురై.. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. నేడు కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా.. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులను చవిచూశాయి.

బడ్జెట్ తర్వాత మార్కెట్ నష్టాల బాట పట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 5.39 పాయింట్లు పెరిగి 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 23,482 వద్ద నిలిచింది.

సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మరోవైపు జొమాటో, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రకటించిన పథకం నేపథ్యంలో.. అగ్రి స్టాక్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాగే, క్లీన్‌టెక్ మిషన్ కింద సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో ఆయా రంగాల షేర్లు లాభపడ్డాయి. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం స్టార్‌హెల్త్ షేర్ల కొనుగోలుకు ఊతమిచ్చింది.

Leave a Reply