బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..
కుంటాల, ఆంధ్రప్రభ : మండలం లింబా (కే) గ్రామానికి చెందిన గురుజల వినోద్ అనే యువకుడు ఇటీవల మృతి చెందడంతో కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బాధిత కుటుంబ సభ్యులను కుంటాల మాజీ ఎంపీపీ జీ.వి. రమణారావు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి సాయన్న, అష్టం నరేష్, దత్తూరాం పాటిల్, మనోహర్ పాటిల్, ధోల్డ్లా రమేష్, గంగారెడ్డి, ముత్యం రెడ్డి, మాధవరావు పాటిల్, రాజుఎర్రోళ్ల, అనిల్, సాయికుమార్, తాటి శివ, ధోనిగా మరాజ్‌కుమార్, కళ్యాణ్ గజేందర్, కుమ్మరి సవిన్ తదితరులు పాల్గొన్నారు.
