Festival | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్ర మైన శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం స్వర్ణ రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు దేవస్థానం కార్యం(Temple work) నిర్వహణ అధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు(To Sri Swami Ammavar) స్వర్ణరథోత్సవం నిర్వహించాం అన్నారు. ఆరుద్రోత్సవంలో భాగంగా శనివారం వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించబడ్డాయన్నారు. అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించామని తెలిపారు.
ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు(rains) కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలి అన్నారు. దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు(Temple priests) లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు.

అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7 లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం(Nandimandapam) వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అదే విధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం(Traditional dance), ఏర్పాటు చేశారు. ఈనాటి స్వర్ణరథోత్సవంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, జి. గంగమ్మ, డి. వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


