farmer died | గట్టు పంచాయితీ.. రైతు బలి

farmer died | గట్టు పంచాయితీ.. రైతు బలి

కనగర్తిలో దారుణ ఘటన


farmer died | ఓదెల, ఆంధ్రప్రభ : భూవివాదంలో చోటు చేసుకున్న గట్టు పంచాయితీ ఒక రైతు ప్రాణాన్నే బలిగొంది. పెద్దపల్లి జిల్లా (Peddapally district) ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూమి పంచాయతీలో ఇద్దరు రైతులు గొడవపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు (farmer died).

పోలీసుల కథనం ప్రకారం.. కనగర్తికి చెందిన ఆది రాజయ్య (Adi Rajaiah)(తండ్రి మల్లయ్య) అదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య (తండ్రి ఐలయ్య)లకు చెందిన వ్యవసాయ భూమి వద్ద గట్టు పంచాయతీ నడుస్తోంది. భూ తగాదాలు కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఇవాళ ఉదయం పొలం వద్దనే ఇరువురు రైతులు (Farmers) ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకనొకరు బలంగా తోసుకోవడంతో ఆది రాజయ్య (తండ్రి మల్లయ్య) పొలంలో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply