ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌…

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌…

జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు ప‌టిష్ట భద్రత కల్పించడం జరిగిన‌ప్పటికీ.. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు.

భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, కాకాని తరుణ్, బి.కృష్ణారెడ్డి (భాజ‌పా), కె.సురేష్ (తెదేపా), వై.ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్‌సీపీ) త‌దిత‌రులు ఉన్నారు.

Leave a Reply