Election | జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజాస్వామ్యానికి పిలుపు…

Election | జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజాస్వామ్యానికి పిలుపు…
Election | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలో ఘనంగా ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. ఓటు హక్కు మన జన్మహక్కు, ఓటే ప్రజాస్వామ్యానికి పునాది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఓటులోనే ఉంది అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వినియోగించుకోవాలని, విలువైన నాయకుడిని ఎన్నుకోవడమే మంచి పాలనకు మార్గమని సూచించారు.
దేశ అభివృద్ధికి ఓటు ఓ శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరవాసులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్యానికి తమ మద్దతు తెలిపారు. జెండాను తొక్క కూడదు, దానిపై ఎలాంటి రాతలు రాయకూడదు. జెండా మధ్యలో అశోక్ ని ధర్మచక్రం ఉంటుంది. జెండా పాతదైన తర్వాత దాన్ని కాల్చివేయాలి తప్ప ఎలాంటి చెత్తబుట్టలో నువ్వు వేయకూడదు అలా చేస్తే పది సంవత్సరాలు కఠిన గారాగాల శిక్ష అని చట్టం చెబుతుంది. నిబంధనలన్నీ పాటించాల్సి ఉంటుంది.
