Elected as Sarpanch | నిన్న కిరాణా శాపు నిర్వాహకురాలు…

Elected as Sarpanch | నిన్న కిరాణా శాపు నిర్వాహకురాలు…

  • నేడు గ్రామసర్పంచ్ గా గోమాస శ్యామలతశ్రీకాంత్

Elected as Sarpanch | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామానికి చెందిన గోమాస శ్రీకాంత్ ను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఉన్నత చదువు డిగ్రీ బీ కాం కంప్యూటర్స్ చదువుకునారు. గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1 పరీక్ష రాసి ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కాని ఆఉద్యోగం రానప్పటికీ ఇంట్లో కాళీగా ఉండకుండా కిరాణా షాప్ నిర్వహించేవారు. తన చిన్న నాటి మిత్రుడు క్లాస్ మెట్ ఐన గోమాస శ్రీకాంత్ మనుసు గెలిచి 2018లో తన కుటుంబాన్ని ఒప్పించి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. గోమాస శ్యామలత పొరుగూరు తాండూర్ గ్రామం నుంచి వచ్చిన కోడలే కాదు బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామ మొదటి పౌరురాలు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాల గురిజాల గ్రామపంచాయతి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, నేతకాని మహర్ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోమాస శ్రీకాంత్ కు జిల్లా వ్యాప్తంగా యువకుల్లో ప్రజల్లో మంచి పేరు ఉంది. తన భర్త గోమాస క్రికాంత్ అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ అందరికి చేరువయ్యారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతి ఎన్నికల్లో పోటీచేసిన శ్యామలత శ్రీకాంత్ సర్పంచ్ గా గెలిపించడంతో.35 ఏళ్ల చరిత్ర కలిగిన సీపీఐ, సీపీఎం కమ్యూనిస్ట్ ల కంచు కోటను బద్దలు కొట్టి తిరుగు లేని సర్పంచ్ గా గ్రామ చరిత్ర పుటల్లో నిలిచిపోయారని గ్రామ పంచాయతీ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజల ఆశీర్వాదమే తనను సర్పంచ్ ను చేసిందన్నారు….

  • గ్రామాన్నిఅన్నివిధాలా అభివృద్ధి చేస్తా..

తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన మాల గురుజాల గ్రామపంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో తన భర్త గోమాస శ్రీకాంత్ ప్రోత్సహంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇప్పిస్తానని ఇంటింటా మిషన్ భగీరథ నీరు అందిస్తానని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని శ్యామలత పేర్కొన్నారు.

Leave a Reply