fishermens | మత్స్యకారుల అభ్యున్నతికి కృషి..

fishermens | మత్స్యకారుల అభ్యున్నతికి కృషి..
fishermens | ఎడపల్లి, ఆంధ్రప్రభ : మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రభుత్వ సలహాదారు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి (Proddaturu Sudarshan Reddy) అన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువులో శనివారం ప్రభుత్వ సలహాదారు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వంశీ కృష్ణా రెడ్డి, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయస్వామితో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకార సంఘాలు (Fishermen associations) లాభాల బాటలో పయనించేందుకు గాను సంఘం సభ్యులు పాటుపడాలని, అప్పుడే గంగపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు.
