Earth Quake In Nepal : నేపాల్ లో భూకంపం

Earth Quake in Nepal : నేపాల్ లో భూకంపం
హిమాలయాల్లో అలజడి
ఉత్తర భారతం గజగజ
బీహారీలు వీధుల్లోకి పరుగులు
పశ్చిమ బెంగాల్లో భవనాలు ఊగిసలాట
సిక్కింలో భయాందోళన రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
Earth Quake in Nepal ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ : పశ్చిమ నేపాల్‌లోని పశ్చిమ ప్రావిన్స్, దార్చులా (darchula) జిల్లా, ఘుసా (Ghusa) ప్రాంతం సోమవారం ఉదయం కంపించింది. భారత కాలమానం ప్రకారం, ఉదయం 8:13- 8:28 గంటల మధ్య భూమి (Earth Quake) కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది.
(LOT : 29.59 N, లాంగ్ : 80.83 E). భూకంప కేంద్రం 5 కి.మీ.లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం ( No casuality) జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు రాలేదు. నేపాల్ లో భూకంపంతో భారతదేశంలో అలజడి నెలకొంది. జనం భయాందోళనకు గురయ్యారు.
Earth Quake in Nepal |ఇళ్ల నుంచి బయటకు పరుగులు

నేపాల్, -భారత సరిహద్దులో భూకంప కేంద్రం ఉండటంతో.. హిమాలయా (Himalaya Range) ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. బీహార్‌లో భవనాలు (Buidings Shaked) ఊగిపోయాయి. స్విచ్చాఫ్ లోని (Switched off Fans rotated) సీలింగ్ ఫ్యాన్లు కదిలాయి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్ దార్జిలింగ్ ప్రాంతాల్లో భూకంపం ( Darjiling) తీవ్రత ఎక్కువగా కనిపించింది.
. జనం భయపడి పోయారు. ఇళ్లల్లోంచి వీధుల్లోకి చేరుకున్నారు. అనేక భవనాలు కొన్ని సెకన్లు ఊగాయి. ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ ల్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో తేలికపాటి అలజడి. ఢిల్లీలోనూ , NCRలో స్వల్ప భూక్రపంపనలు కనిపించాయి.
