ఆర్టీసీకి దసరా కలెక్షన్స్..

  • రికార్డు వసూళ్లు
  • రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం
  • మహబూబ్‌నగర్ టాప్

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దసరా పండుగకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ ఖజానాకు భారీ లాభం చేకూరింది. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించడంతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడమే కాకుండా ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్ర స్థాయిలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

దసరా సెలవులు ఇచ్చిన 14 రోజుల్లో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 డిపో లలోని మొత్తం 906 బస్సులలో 796 ప్రత్యేక బస్సులను హైదరాబాద్ కు నడిపి 53 లక్షల 7 వేల కిలోమీటర్లు తిప్పి, 63 లక్షల 20 వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసినట్లు అధికారులు తెలిపారు.

ఆదాయం రూ. 33 కోట్ల 65 లక్షలతో రికార్డు నెలకొల్పి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. దసరా, బతుకమ్మ పండుగలకు దూరంగా ఉండి, విధులకు హాజరై, హైదరాబాద్ రూట్లలో విపరీతమైన వాహనాల రద్దీ ఉన్నా కూడా ఓపికతో చిన్న ప్రమాదం జరపకుండా, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేసి, జిల్లా ఆర్టీసీకి మంచి పేరు తెచ్చారని ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కొనియాడారు.

ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ను ప్రధమ స్థానంలో నిలపడంలో కృషి చేసిన అధికారులకు, ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply