Drugs Free India | డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయం
Karimnagar | గోదావరిఖని టౌన్ , ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా “నషా ముక్త్ భారత్ అభియాన్(Nasha Mukt Bharat Abhiyan)”ను విజయవంతం చేయాలనే సంకల్పంతో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఈ రోజు సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం మున్సిపల్ కమిషనర్ జె.అరుణశ్రీ(J. Arunashree) నగర పాలక సంస్థ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా సమాజంపై ఏర్పడే దుష్ప్రభావాలపై అవగాహన పొందారు. అనంతరం ప్రతిజ్ఞ దృవీకరణ పత్రం డౌన్‌లోడ్(Download) చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్‌లను పంపిణీ చేశారు.
గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రామగుండం మున్సిపల్ అథారిటీ నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్స్(Drugs)కు దూరంగా ఉంటూ విద్యార్థులు అంగీకార ప్రమాణం చేశారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అధికారులు వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా(Drugs Free India)’ పోస్టర్లను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వి.రామన్, అదనపు కమిషనర్ మారుతీ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి(Naini Venkata Swamy), సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఓ ఆంజనేయులు, ఏసీపీ శ్రీహరి, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, అలాగే ప్రభుత్వ పాఠశాల–కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, సంజీవయ్య, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.



