Drug | మత్తుపై ఉక్కుపాదం

Drug | మత్తుపై ఉక్కుపాదం
- గన్నవరంలో 112 కిలోల గంజాయి
- పెనమలూరు ప్రాంతంలో 2.5 కేజీలు స్వాధీనం
Drug | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు (V. Vidyasagar Naidu) హెచ్చరించారు. బుధవారం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లా గన్నవరంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 112 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. గంజాయి స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేశామన్నారు. రవాణా చేసే దీపక్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి దాదాపు రూ.10 లక్షలు విలువ ఉంటుందని అంచనా. అదేవిధంగా పెనమలూరు ప్రాంతంలో 2.5 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను ఎస్పీ అభినందించారు.
