త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం

త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం
కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలోని ప్రధాన మెయిన్ రోడ్డు పక్కన గల చిన్న మోరీ కాలువ నుండి మారుతీ నగర్ కాలనీకి వెళ్ళే పైపు లైన్ నుంచి కలుషితమైన తాగునీరూ సరఫరా అవుతోంది.పైపులైన్ల లీకేజీలు,గేట్ వాల్వుల వద్ద బురద గుంతగా మారి పిచ్చి మొక్కలు పెరిగి నీటి వనరులు మురికిగా మారుతున్నాయి.
ఒకే ప్రధాన పైపు లైన్ గుండా మొత్తం 3 లీకేజీలు ఉన్నాయి. నెలలు గడుస్తున్నా ఈసమస్యను సంబంధిత అధికారులు పరిష్కారించడం లేదనీ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నీరు త్రాగడం వలన ప్రజలకు జ్వరాలు,విరేచనాలు తదితర రోగాల బారిన పడే అవకాశం ఉందనీ ప్రజలు వాపోతున్నారు.తక్షణం అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది.

లిక్ అయిన పైపు లైన్ నుంచి నిరంతరం కలుషిత నీరు ప్రవహించడంతో రహదారి పూర్తిగా తడిసి బురదమయంగా మారింది.దీంతో వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.లీకేజీ పైపు లైన్ లోకి మురికి కాలువల నుంచి నీరు చేరి కలుషితం అవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి లీక్ అయిన పైపు లైన్లకు మరమ్మత్తులు చేయాలని,వృధాగా పోతున్న నీటిని నిలిపి వేసి ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
