NZB | ఎండిన పసుపునే మార్కెట్ కు తీసుకు రావాలి
- వ్యాపారులు సిండికేట్‌గా కాకుండా.. రైతుల ప్రయోజనాల కోసం నడుచుకోవాలి
- రైతులకు నష్టం జరిగితే ఊరుకునేది లేదు.
- మార్కెట్ యార్డ్ ను సందర్శించిన పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : పసుపు రైతులు పూర్తిగా ఎండిన పసుపుని మార్కెట్ యార్డ్ కు తీసుకురావాలని జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి సూచించారు. మార్కెట్ యార్డులో రైతులకు నష్టం కలిగితే ఊరుకునేది లేదని పసుపు బోర్డు చైర్మన్ హెచ్చరించారు.గురువారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటినీ పసుపు బోర్డు చైర్మన్ సందర్శించా రు.
యార్డులో పసుపు క్రయ విక్రయాలను పరిశీలించి, పసుపు రైతులతో మాట్లా డారు. పసుపు రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.గత రెండు మూడు రోజుల నుంచి మార్కెట్ యార్డు లో జరుగుతున్న గందర గోళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చైర్మన్ పల్లే గంగారెడ్డి సందర్శిం చా నని తెలిపారు.
ఈ సంద ర్భంగా రైతులతో మాట్లా డారు రైతులకు ఎటువం టి నష్టం కలిగించిన సహించేది లేదన్నారు. కమిషన్ ఏజెంట్లు వ్యాపా రస్తులు రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు కాసేపు రైతులతో కలిసి ముచ్చ టించారు.
పచ్చి పసుపు ను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని రైతులను కోరారు. మార్కెట్ అధికా రులు యార్డ్ కు వచ్చే పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశిం చారు. వ్యాపారస్తులు సిండికేట్ కాకుండా రైతు లకు లాభపేక్షంగా నడు చుకోవాలని పచ్చి పసుపు ను వ్యాపారస్తులు కోను గోలు చేస్తే మార్కెట్ కమి టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పసుపు క్రయ విక్రయల గురించి తెలుసుకున్నారు పసుపు కుప్పలను సంద ర్శించారు. ఈ సందర్భం గా పసుపు బోర్డు చైర్మెన్ మాట్లాడు తూ రైతులు తమ పసు పును బాగా ఎండబెట్టి, తేమ శాతము లేకుండా తీసుకొనివస్తే మార్కెట్లో మంచి ధర వస్తుందని సూచించారు. కమీషన్ ఏజెంట్లందరికి రైతుసోద రుల గ్రామాల నుండి బాగా ఎండిన పసుపును మాత్ర మే యార్డుకు తీసుకురా వాలని సూచించారు.
ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి మార్కెట్ కమిటి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరి అపర్ణ, సెక్రటరి గ్రేడ్-2 శ్రీధర్, కార్యాలయ సిబ్బంది వ్యాపారస్తులు మాస్టర్ శంకర్ లాబిశెట్టి శ్రీనివాస్ సెల్లార్ కమిటీ అధ్యక్షులు దేవేందర్, తారక్ వేణుగోపాల్ తొగర నారాయణ బిజెపి నాయకులు గంగోని గంగాధర్ గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.