ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని రాయిలాపూర్ గ్రామంలో అమృత నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని,రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని,పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని,ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు,పట్టణాలు లేవని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు…
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫారం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్. మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మండల అధ్యక్షులు రమణారెడ్డి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తి రెడ్డి,గర్ధాస్ నరేందర్,భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
