గ్రామపంచాయతీ ముందు ధర్నా..

గ్రామపంచాయతీ ముందు ధర్నా..
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : లింగవారిగూడెం గ్రామానికి కృష్ణ నీళ్లు సప్లై చేసే మెయిన్ పైపు పగిలి వారం రోజులు అవుతున్నా గ్రామపంచాయతీ సిబ్బంది పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల ప్రతాప్ ఆదివారం ఉదయం ధర్నా చేశాడు. వారం రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలకు తాగునీరు, గ్రామంలోని బోరు నీళ్లు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్నిసార్లు గ్రామపంచాయతీకి మొరపెట్టుకున్నా సమస్యను పరిష్కరించడం లేదంటూ నిరసనకు దిగాడు.
