Dharna | ఉపాధి హామీ నాశ‌నం చేసేందుకే…

Dharna | ఖమ్మం నగరం, ఆంధ్ర‌ప్ర‌భ‌ : జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఖమ్మం గాంధీ చౌక్ నందు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ‌ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందన్నారు.

ప్రధాని మోడీ‌ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకానికి నిధులను కేటాయించడం తగ్గించిన విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. 125 రోజులు అంటూనే ఉపాధి హామీని అస్పష్టంగా ఇచ్చారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, పువ్వల్ల దుర్గాప్రసాద్ , ఎర్రం బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహారావు, ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పులిపాటి వెంకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగొర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply