Dharmavani | విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..

Dharmavani | విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..

Dharmavani | దేవాదాయ శాఖ ధర్మవాణి కార్యక్రమం నిర్వహణ
కారుణ్య నియామకంతో భార్గవికి ఉద్యోగం
పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం
అర్చక నోటిఫికేషన్‌పై హామీ
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Dharmavani | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : భార్గవి కి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. భార్గవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి అధికారులు ఉంటే సమస్యలు పరిష్కారం అక్కడికి అక్కడే పరిష్కారం అవుతాయని అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగా 80 పైగా వినతులు స్వీకరించారు. వచ్చిన అందరికీ భోజనాలు కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 02:30 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు.

కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకొని ఏడాది నుండి ఎదురుచూస్తున్న జుములాపురం గ్రామం , ఎరుపల మండలం ఖమ్మం జిల్లా కి చెందిన భార్గవి కి ఈరోజు కారుణ్య నియామకం ఇవ్వటం జరిగింది. చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న సర్వీస్ మ్యాటర్స్ ని కూడా అక్కడికి అక్కడే పరిష్కరించారు. అర్చక నోటిఫికేషన్ చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉందని చెప్పారు వెంటనే నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. అందులో అక్కడిక్కడే సుమారుగా 20 పైగా దరఖాస్తులను పరిష్కరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply