శ్రీ ధన మైసమ్మకు వెండి పాదాలు సమర్పించిన భక్తులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; శ్రీ ధన మైసమ్మ దేవాలయం మెట్లబావి అమ్మవారికి 500 గ్రాముల వెండితో వెండి పాదాలను తయారు చేయించి అమ్మవారికి సమర్పించడం జరిగిందని ఆలయ అధ్యక్షుడు తోట బాబన్న తెలిపారు.. శుక్రవారం ఉదయం.. 34 డివిజన్ శివనగర్శ్ శ్రీ ధనమైసమ్మ దేవాలయం, అమ్మవారికి దాతలు కల్వచర్ల సత్యవతి 25 తులాలు వెండిని, సుంచు రమ్య – శ్రవణ్ 50 గ్రాముల (5 తులాలు ) గండిపల్లి మమతా బాబురావు 5 తులాలు రుద్రోజు రేణుక – సదానందం 5 తులాలు వెండిని గుత్తా స్వప్న – గోపికృష్ణ గార్లు 5 తులాలు వెండిని గలాటి ధనలక్ష్మి భరత్ గార్లు5 తులాల వెండిని అమ్మవారి వెండి పాదాలకు సమర్పించడం జరిగింది.
ఈ ఆరుగురు దాతలు సమర్పించిన 500 గ్రాములు ( 50 తులాలు) వెండితో గోల్డ్ స్మిత్ రాగి రాజేంద్రప్రసాద్ చే అమ్మవారి పాదాలను తయారు చేయించడం జరిగిందనీ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న తెలిపారు. ప్రముఖ పూజారి ఓంకార్ అయ్యగారు అమ్మవారి వెండి పాదాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో, వడ్డే కోటేశ్వరరావు ప్రసాదం సమర్పించగా ఆలయ పూజారి వెంకన్న, దాతలు, డివిజన్ ప్రజలు పాల్గొని అమ్మవారి కటాక్ష వీక్షణాలకు పాత్రులైనారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
