Development works | అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటా….

Development works | అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటా….

Development works | పర్వతగిరి, ఆంధ్రప్రభ : మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గడపగడపకి ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు ఈ రోజు పర్వతగిరి మండలం దేవీలాల్ తండాలో ప్రతి గడపకుడపకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాడుగుల రాజు రిమోట్ గుర్తు, వార్డు అభ్యర్థిల గెలుపు కోసం ప్రచారం జోరుగా చేశారు.

ఈ సందర్బంగా ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో కళకళలాడిన మన రాష్టం ఈ రెండు సంవత్సరాల్లో ఎలా అయ్యింది అంటే అభివృద్ధి పనులు లేవు, సంక్షేమ పథకాలు లేవు అన్ని 420 దిక్కుమాలిన హామీలు ఇచ్చి రైతులను, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను అందరిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీకి సరైన బుద్ధి చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

అధికారం కోసం కాకుండా అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటున్న మాడుగుల రాజుని భారీ మెజారిటీ(huge majority)తో గెలిపించాలి అని అన్నారు.

Leave a Reply