సమగ్ర శిక్ష సిబ్బంది నల్ల రిబ్బన్‌లతో నిరసన

సమగ్ర శిక్ష సిబ్బంది నల్ల రిబ్బన్‌లతో నిరసన
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వేతనాలు చెల్లించడంతో పాటు గత సంవత్సరం 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కమ్మర్ పల్లి మండల వనరుల కేంద్రంలో సిబ్బంది నల్ల రిబ్బన్ లతో సోమవారం నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా సిఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడు,ఇప్పటి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీ సమస్యలను చాయ్ తాగే లోపల పరిష్కరిస్తారని హామీ ఇచ్చారనీ, ఈ హామీలను నెరవేర్చాలని సమ్మె సమయంలో చేసిన డిమాండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిష్కరిస్తారని ఇచ్చిన హామీ ఇంత వరకు నేర వేర్చ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే గతంలో నిర్వహించిన 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మర్ పల్లి సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన కార్యక్రమం లో ఏం ఐ ఎస్ సురేందర్, సి సిఓ ప్రవీణ్, సి ఆర్ పి అంజయ్య,మెసెంజర్ రతన్ తదితరులు పాల్గొన్నారు.
