Delhi vs Lucknow – ఢిల్లీ లక్ష్యం ఎంతంటే..

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేధికగా ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో నిర్ధారిత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ గెలవాలంటే 210 పరుగులు చేయాల్సి ఉంది.

జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. లఖ్ నవూ బ్యాటర్లు నికోలస్ పూరన్ (75; 30 బంతుల్లో; 6 ఫోర్లు, 7 సిక్స్లు), మిచెల్ మార్ష్ (72; 36 బంతుల్లో; 6 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు.

చివర్లో డేవిడ్ మిల్లర్ (27*) వేగంగా పరుగులు చేశాడు. దీంతోనిర్ణీత 20 ఓవర్లలో లఖ్నవూ 209/8 స్కోరు చేసింది. దిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుర్దీప్ యాదవ్ 2, విప్రిజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *