Chess | జూన్‌ 7నుంచి ఢిల్లి గ్రాండ్‌మాస్టర్‌ ఓపెన్‌..

రికార్డు ప్రైజ్‌మనీ రూ.1.21 కోట్లతో ఢిల్లి చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 7నుంచి ఢిల్లి గ్రాండ్‌మాస్టర్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. 21వ ఎడిషన్‌ చత్తర్‌పూర్‌లోని టివోలి గార్డెన్స్‌లో జూన్‌ 7నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ టోర్నీ వర్ధమాన చెస్‌ ప్లేయర్స్‌కు చక్కని అవకాశం.

అర్జున్‌ ఎరిగైసి, అర్వింద్‌ చిత్తంబరమ్‌, ప్రజ్ఞానంద, ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ దొమ్మరాజు వంటి మాస్టర్లు ఒక్కప్పుడు ఈటోర్నీలో ఆడినవారే కావడం విశేషం. ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ పరిధిలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ పార్టిసిపేషన్‌ పరంగా ఆసియాలోనే అతిపెద్ద క్లాసికల్‌ ఫార్మాట్‌ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందింది.

ఈసారి 15 దేశాల నుంచి దాదాపు 2500మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. వీరిలో 20మంది గ్రాండ్‌మాస్టర్లు కూడా ఉన్నారు. ఇక ప్రైజ్‌మనీ కూడా 168శాతం పెరిగింది. ఫైడ్‌ రూల్స్‌ ప్రకారం అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి.

Leave a Reply