రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే ఫ్రాంచైజీ తరఫున 9,000 టి20 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. ఈరోజు లక్నోతో జరుగుతున్న మ్యాచ్ లో 12 బంతుల్లో 27 పరుగులు బాదిన ఛేజ్ మాస్టర్ విరాట్ ఈ మైలురాయిని చేరుకున్నారు.
ఈ సీజన్‌లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 60.88 సగటుతో 548 పరుగులు చేసి ఆర్సీబీకి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ సంవత్సరం కోహ్లీ అత్యుత్తమ స్కోరు 73* కాగా.. ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా ఉన్నాడు.
కాగా, నేటి మ్యాచ్ లో ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, టాప్-2లో స్థానం దక్కించుకుని, క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌తో తలపడే అవకాశాన్ని పొందుతుంది.