DCP | భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

DCP | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : భక్తుల రాకపోకలకు, భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఇప్ప గూడెం చింతగట్టు సమ్మక్క సారక్క దేవాలయాన్ని ఈ రోజు ఏసీపీ భీంశర్మతో కలిసి డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సమీక్షించి పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని అధి కారులకు సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు మెరుగుపర్చాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క దేవాలయ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయా లని డీసీపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ కుమార్, చైర్మన్ తోట వెంకన్న, వైస్ చైర్మన్ మ్యాదరవేన కరుణాకర్, సర్పంచులు మందపురం రాణి అనిల్, జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, సోమయ్య, కమిటీ సభ్యులు ఎల్లాగౌడ్, కట్టయ్య, సురేష్, మహేందర్, పూజారులు, ఎండో మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
