Dandepalli election | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా!

Dandepalli election | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా!
Dandepalli election | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని కాంగ్రెస్ పార్టీ(Congress party) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిలుకూరి మహేష్ అన్నారు. ఈ రోజు గ్రామంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి చిలుకూరి మహేష్ ఇంటి ఇంట ప్రచారాన్ని నిర్వహించారు.
గ్రామ ప్రజలు తమకు ఓటు వేసి భారీ మెజార్టీ(huge majority)తో గెలిపించాలని కోరారు. తనను ఆశీర్వదిస్తే గ్రామానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) సహకారంతో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇస్తూ కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.
