Dandepalli | ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Dandepalli | ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సర్పంచ్ మురుపుటాల మానస సంజీవ్ అన్నారు. దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో సాంకేతిక విద్యనందించేందుకు టీవీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని ఇవాళ వారు ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి తనకు తోచిన సహాయంతో స్కూల్ కి టీవీని కొని ఇవ్వడం జరిగిందన్నారు. టీవీ ద్వారా పిల్లలు ప్రత్యక్షంగా చూస్తూ వినడంతో ఎక్కువ అభ్యసన ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబాజీ, పాఠశాల చైర్మన్ స్వప్న, వెల్గనూర్ కాంప్లెక్స్ సిఆర్పి ఉగ్గే రమేష్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు సునీత, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply