Crop | కాలానికి అనుగుణంగా పంటల సాగు చేయాలి

Crop | కాలానికి అనుగుణంగా పంటల సాగు చేయాలి
- మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు
Crop | తుగ్గలి, ఆంధ్రప్రభ : వ్యవసాయంలో లాభదాయకమైన పంటలు సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందాలని మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు రైతులకు సూచించారు. గురువారం రామలింగాయ పల్లెలో వ్యవసాయ శాఖ అధికారి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా ! మీకోసం’ కార్యక్రమాన్ని మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ఐదు సూత్రాలను తీసుకొచ్చిందన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రా సెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు ధర వంటి వాటిపై రైతుల్లో కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ‘రైతన్నా ! మీకోసం’ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 20 వేలను అన్నదాత సుఖీభవ సాయం కింద ఇప్పటికే రెండు విడుదలగా ఒకొక్క రైతుకు రూ. 14 వేలు ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు కాలానికి తగ్గట్టుగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసుకోవాలని కోరారు. వ్యవసాయంలో భారీగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఆదాయాన్ని పెంపొందించుకునేలా నూతన టెక్నాలజీని అలవర్చు కోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి రైతు పాడి పశువులు, కోళ్ల పరిశ్రమ, పొట్టేళ్ల పెంపకం వంటి జీవనోపాదులను పెంపొందించుకోవాలని కోరారు. అలాగే బొందిమడుగుల గ్రామంలో జరిగిన రైతన్నా ! మీకోసం కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ తిరుపాల్ నాయుడు, సాగునీటి సంఘం అధ్యక్షుడు నునసారాళ్ళ రామాంజనేయులు, సర్పంచ్ సలహాదారుడు ప్రతాప్ యాదవ్, సహకార సంఘం డైరెక్టర్ మోహన్, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
