Crime | కత్తితో దాడి చేయడంతో ఫైర్

Crime | కత్తితో దాడి చేయడంతో ఫైర్
Crime | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కడప జిల్లాలో సంచలనం రేపిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట అగ్రహరంలో యువతి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో పోలీసులు అతడిని వెంబడించగా, నిందితుడు కత్తితో దాడికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. లొంగిపోవాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిందితుడు సహకరించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కాజీపేట ఇన్‌స్పెక్టర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు కడప జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఒక రౌండ్ గాలిలోకి కాల్చగా, మరో రౌండ్ నిందితుడి కాలిపై ఫైర్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

