జైపూర్ – రాజస్థాన్‌లో ఎయిర్ ఫోర్స్ (IAF ) విమానం నేడు కుప్పకూలింది (Crash ) . చురులోని రతన్‌గఢ్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ లు ఇద్దరు (Two poilets ) అక్కడికక్కడే ప్రాణాలు (died ) కోల్పోయాడు. ప్రమాద ధాటికి పొలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు సహయక చర్యలు చేపట్టారు.
ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి….
పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా వెనక్కి తిరిగి పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 169 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పక్షి బలంగా ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పాట్నాలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. ఇటీవలే పాట్నా నుంచి రాంచీ వెళుతున్న మరో ఇండిగో విమానాన్ని గాల్లో గద్ద ఢీకొట్టింది. ఆ సమయంలో విమానం దాదాపు 4,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు ఉండగా, పైలట్ చాకచక్యంగా విమానాన్ని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సురక్షితంగా దించారు.